నెక్లెస్ రోడ్డు కూడా FTL లో ఉంది.. మరి కూల్చేస్తారా..? – అసదుద్దీన్ ఓవైసీ

-

నెక్లెస్ రోడ్డు కూడా FTL లో ఉంది.. మరి కూల్చేస్తారా..? అని ప్రశ్నించారు MIM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్..ధారుసల్లాం నుండి MIM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల ftl లో నిర్మాణాలు ఉన్నాయి…గోల్కొండ లో కూడా గోల్ఫ్ కోర్టు ఉందని తెలిపారు. ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడుతారని తెలిపారు. అక్కడికి వెళ్లి చూడండి.. లేదంటే ఆ నేను ఫోటోలు కావాలంటే నేను ఇస్తానని ప్రకటించారు.

MIM MP Asaduddin Owaisi comments on cm revanth

Ftl సమస్య పై మేయర్ నీ కలిసి చెప్పాను.. ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందో చూడాలన్నారు. కేంద్రం వక్ బోర్డు చట్ట సవరణ పేరుతో నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆగ్రహించారు. హిందూ చట్టంలో పేరెంట్స్ ఆస్తి నీ వారి పిల్లల్లో ఎవరికైనా రాసి ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. ముస్లిం చట్టం లో అలా కుదరదు.. కేవలం 1/3 మాత్రమే రాసేలా ఉందని చెప్పారు. హిందూ ముస్లిం లు ఎవరికైనా ఆస్తిని డొనేట్ చేసే హక్కు ఉంది.. కానీ వక్ బోర్డు కి డొనేట్ చేయొద్దా..? అంటూ ఫైర్‌ అయ్యారు MIM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version