BRS కండువాతో పోలింగ్ బూత్‌లోకి మంత్రి అల్లోల !

-

నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

Minister Allola enters polling booth with BRS scarf
Minister Allola enters polling booth with BRS scarf

ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కు కండువాతో వెళ్లడం ఏంటని, ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఉదయమైతే ర ద్దీ తక్కువగా ఉంటుందని సినీ రాజకీయ ప్రముఖులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. హైదరాబాద్​లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news