పేదవాని వైద్యం, విద్య మా భాద్యత : మంత్రి రాజనర్సింహ

-

పేదవాని వైద్యం, విద్య మా భాద్యతగా భావించేది కాంగ్రెస్ పార్టీ అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం 5 లక్షల నుంచి 10 లక్షల కు పెంచాం. 1375 ప్రోసీజర్లకు ధరలను 22శాతం కి పెంచాము. ఆరోగ్యం సబ్ సెంటర్లు, PHC, ఏరియా హాస్పిటల్స్ , మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు 500 కోట్ల రూపాయలు విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్ దే. 2 వేల కోట్ల రూపాయలు లతో కొత్త ఉస్మానియా దవాఖానా కు శంకుస్థాపన చేసుకోబోతున్నాం.

క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, వంటి దీర్ఘకాలిక వ్యాధులను కట్టడి చేసేందుకు ఆయా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలకు హాస్టల్స్ కి శంకుస్థాపన చేసుకున్నాం. పెదవానికి వైద్యం కోసం అప్పులపాలు కావొద్దు అనేది మా లక్ష్యం. ఇక ఇవ్వాళ ప్రారంభించిన 213 అంబులెన్స్ లతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం 20 నిమిషాల నుంచి 13 నిమిషాలకు చేరుకుంది. అలాగే 80 ట్రామ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధం అవుతున్నాం అని మంత్రి రాజనర్సింహ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version