నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు అంబాసిడర్లు..!

-

విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ట్రాఫిక్ అంబాసిడర్ లను ఏర్పాటు చేస్తాం అని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఎక్కడైనా ట్రాఫిక్ జాం కాగానే వెంటర్ వాట్స్ అప్ గ్రూపు లో ఫొటోస్ అప్ లోడ్ చేయాలి. అక్టోబర్ నుండి నవంబర్ కి ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించగలిగాం. 112 నుండి 72 కిలోమీటర్ల అంతరాయాన్ని తగ్గించాము. ట్రాఫిక్ కంజషన్స్ తగ్గించాలంటే టెక్నాలజీ ఉపయోగించాలి. ట్రాఫిక్ అంతరాయం ఎక్కడుంటుందో డ్రోన్ అక్కడ ఉంటుంది. ట్రాఫిక్ ని పసిగట్టి వెంటనే సమాచారాన్ని చేరవేస్తుంది. అన్ ప్లాన్డ్ ఇన్సిడెంట్స్ ని గుర్తించడమే ఈ ఆప్ పని.

పోలీసులు అస్త్రం యాప్ ని ఉపయోగించి త్వరగా స్పందిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుండే జంక్షన్ కానిస్టేబుల్ లకు సూచనలను అందిస్తున్నాము. FM ద్వారా ట్రాఫిక్ పై మెసేజ్లను అందిస్తున్నాము. త్వరలోనే ఎల్ఇడి బోర్డులను ఐదు జంక్షన్ లో ఏర్పాటు చేయబోతున్నాము. కొన్ని డ్రోన్లను వెస్ట్ బైపాస్ కి ,రామవప్పాడు రింగు వద్ద ఏర్పాటు చేస్తాం. రేపు మధ్యాహ్నం ట్రాఫిక్ ఎలా ఉండబోతుంది అనేది అస్త్రం అనే ఏ ఐ టూల్ ద్వారా తెలుసుకుంటాము. డిసెంబర్లో ఇంకొంచెం మెరుగుపడే విధంగా మార్పులను చేశాము. ఇంకా విప్లవాత్మకమైన మార్పులను ట్రాఫిక్ లో చేయబోతున్నాం అని సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version