బంజారహిల్స్ కేర్ ఆసుపత్రి లో రోబాటిక్ సర్జరీ సెంటర్ ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కొత్త టెక్నాలజీ ద్వారా శస్త్ర చికిత్స మరింత సులువు గా మారుతుందని అన్నారు. రోబాటిక్ సర్జరీ ద్వారా పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నారని అన్నారు. బెస్ట్ ట్రీట్మెంట్ తో పాటుగా ఎకనామికల్ ట్రీట్మెంట్ కూడా అవసరమన్నారు.
హైదరాబాద్ మెడికల్ టూరిజం హబ్ గా మారుతుందని అన్నారు. ఏ ప్రాబ్లమ్ లేని నగరం ఏదైనా ఉంది అంటే దేశంలో అది హైదరాబాద్ నగరమేనన్నారు. అవయవ మార్పడి చికత్సలకు ఆరోగ్య శ్రీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం పది లక్షలు ఇస్తుందన్నారు. ఐటి హబ్ గా ఉన్న హైదరాబాద్ త్వరలోనే మెడికల్ హబ్ గా మారనుందన్నారు. 33 జిల్లాలలో మెడికల్ కాలజీ లు వస్తున్నాయని, ఇప్పటికే 17 కాలేజీ లు ఏర్పాటు అయ్యాయన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి లో అడ్మినస్ట్రేషన్, శానిటేషన్ ని చాలా మెరుగు పరిచడం జరిగిందన్నారు. సి సెక్షన్ తగ్గాలని గవర్నమెంట్ ఆసుపత్రి లో నార్మల్ డెలివరీ చేస్తే మూడు వేలు రూపాయలు ఇస్తున్నామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రి లో సి సెక్షన్స్ 70 నుంచి 75 శాతం ఉందని, ప్రైవేట్ ఆసుపత్రిలో సి సెక్షన్స్ తగ్గించాలన్నారు.