మామునూర్ ఎయిర్ పోర్టుపై ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో ఈ సమావేశం కొనసాగుతోంది.ఎవియేషన్ డైరెక్టర్ భారత్ రెడ్డి, ఆర్ & బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరిచందన, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాత్కాలిక ఏర్పట్లకన్న భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేయాలని అధికారులకు సూచించిన మంత్రి కోమటిరెడ్డి… త్వరితగతిన భూసేకరణ పూర్తిచేసి మూడేండ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.
ప్రతీ పదిహేను రోజులకోసారి పనుల పురోగతిపై రివ్యూ చేస్తానన్న మంత్రి… గత ప్రభుత్వంలాగా హామీలతో కాలం వెల్లబుచ్చితే అర్ధం లేదని వివరించారు. విమానాశ్రయం నిర్మించి వదిలేయకుండా విమానాల రాకపోకలపై దృష్టిపెట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులకు సూచించిన మంత్రి కోమటిరెడ్డి… వరంగల్ ఎయిర్ పోర్ట్ ను ఉడాన్ స్కీంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చాలని సూచించారు. యునెస్కో సైట్ రామప్ప, భద్రకాళీ, వెయ్యిస్తంభాల దేవాలయం ఇతర కాకతీయ కట్టడాలతో పాటు టెక్స్ టైల్ పార్క్ అవసరాలు, భవిష్యత్ పరిశ్రమలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దాలని సూచనలు చేశారు.