ఢిల్లీలో కేటీఆర్ ను ఎవరు లెక్క చేస్తారు : మంత్రి కోమటిరెడ్డి

-

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుస కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. భారతదేశంలో వేల మంది ఎమ్మెల్యేలు ఉంటారు.. అందులో కోన్ కిస్కా కేటీఆర్ ను ఎందుకు లెక్క చేస్తారు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. అలాగే కేటీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న కారణం కూడా ఆయన వివరించారు.

ఆర్బీఐ అనుమతి లేకుండా రూపాయలను పౌండ్లుగా మార్చారు. కేటీఆర్ ఆదేశాలతోనే విడుదల చేసానని అరవింద్ కుమార్ చెప్పారు. అక్కడే కేటీఆర్ దొరికిపోయాడు. దాంతో గవర్నర్ ప్రాసిక్యూషన్ కు రాసాడు. ఆ యాక్షన్ కు రియాక్షన్ గానే ఢిల్లీ వెళ్ళాడు. తన కేసును డీవియేట్ చేయడానికే మనోహర్ లాల్ కట్టర్ ను కలిసాడు అని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version