జగిత్యాల సబ్ జైల్ లో ఖైదీకి గుండెపోటు

-

జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల సబ్ జైల్ లో ఖైదీకి గుండెపోటు వచ్చింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు ఖైదీ. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం కు గుండె పోటు వచ్చింది. సబ్ జైల్ నుండి హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక చికిత్స పొందుతూ ఖైదీ ప్రభుత్వ ఆసుపత్రి లో మృతి చెందాడు.

A prisoner suffered a heart attack in Jagityala Sub Jail

15 రోజుల క్రితం రేప్ కేసులో నిందితుడుగా వచ్చాడు ఖైదీ. మల్లేశం… రామన్న పేట మాజీ ఉప సర్పంచ్ గా పని చేశారు. తప్పుడు కేసుతో మల్లేశం జైలుకు పంపించారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. గుండె నొప్పి రావడం తో నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన చనిపోయేంతవరకు తెలపలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జగిత్యాల సబ్ జైల్ దగ్గర టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version