తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే 1-10వ తరగతి విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే సీఎం అల్పాహారం పథకం అమల్లోకి వచ్చింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో మంత్రి కేటీఆర్, రావిర్యాలలో హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క స్కూల్ చొప్పున 119 చోట్ల ఆయా ప్రజాప్రతినిధులు ఈ పథకాన్ని ఆరంభించారు. దశలవారీగా అన్ని స్కూళ్లకు విస్తరిస్తారు.
అటు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ప్రారంభించారు. దసరా కానుకగా విద్యార్థులకు ప్రకటించిన సీఎం అల్పాహార పథకాన్ని ఉప్పల్లో మహమూద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ.. సీఎం బ్రేక్ ఫాస్ట్ రుచి చూశారు.