ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడింది..మళ్ళీ ప్రజల ఊహించని తీర్పు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే ఆ తీర్పు ఎలా ఉంటుందో ఎవరికి తెలియడం లేదు. వైసీపీ ఏమో..మళ్ళీ తమనే ప్రజలు అదరిస్తారని భావిస్తుంది. ఇటు టిడిపి-జనసేన ఏమో ప్రజా మద్ధతు తమకే ఉందని అనుకుంటున్నాయి. ఇలా ఎవరి వర్షన్ వారికి ఉంది. కానీ ఇప్పటివరౌ ప్రజానాడి అనేది క్లారిటీ లేదు.
కాకపోతే ఒక విషయంలో ఎక్కువ క్లారిటీ కనిపిస్తోంది..అది ఏంటంటే మెజారిటీ ప్రజలు మాత్రం సిఎంగా జగన్‌నే చూడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మామూలుగా ఇటీవల కొన్ని సర్వేల్లో వైసీపీకి అధికారం వస్తుందని,. మరికొన్ని సర్వేల్లో టిడిపి-జనసేన గెలుస్తాయని చెబుతున్నాయి. కానీ కేవలం సిఎంగా మాత్రం చూసుకుంటే మెజారిటీ సర్వేలు జగన్ వైపే ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల ఆత్మసాక్షి సర్వే అనేది ఒకటి వైరల్ అయింది. అందులో అన్నీ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే టిడిపి మ్యాజిక్ ఫిగర్ చేరుకుని అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పింది.
ఇక టిడిపి-జనసేన పొత్తు ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు గెలవచ్చని, కమ్యూనిస్టులని కలుపుకుంటే ఇంకా తిరుగుందని తేల్చింది. అయితే టిడిపి-జనసేనలతో బిజేపి కలిస్తే మాత్రం..వైసీపీదే అధికారమని చెప్పింది. అయితే ఇలా ఒకో లెక్క బయటకొచ్చింది..కానీ ఓవరాల్ గా సిఎం ఎవరనేది సర్వేలో చూస్తే 46 శాతం జగన్…40 శాతం చంద్రబాబుని కోరుకున్నారట. అటు 9 శాతం మంది పవన్ సిఎం కావాలని భావితున్నారట.
అంటే సిఎంగా జగనే కావాలని జనం కోరుకుంటున్నారు. కాకపోతే టిడిపి-జనసేన పొత్తు వల్ల జగన్‌కు రిస్క్ అంటే…బాబుకు 40 శాతం, పవన్‌కు 9 శాతం కలిపితే 49 శాతం. కాబట్టి పొత్తుకు చెక్ పెడితే మళ్ళీ వైసీపీ గెలిచి అధికారంలోకి వస్తుంది.