కిషన్ రెడ్డికి సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్

-

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తాను చెప్పేది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. మీరు చెప్పేది తప్పైతే కేంద్ర మంత్రి పదవి వదిలి పెట్టకపోయినా.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోయ లేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు కేటీఆర్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో మూడు లక్షల 68 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి చెల్లించిందని.. అందులో 1 లక్షా 68 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం తిరిగి రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. కేంద్ర మంత్రికి, మిగిలిన ఎంపీలకు కెసిఆర్ పై విమర్శలు చేయడం తప్ప ఇంకో పని లేదని మండిపడ్డారు. కనీస పరిజ్ఞానం లేకుండా బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలు రెండు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయన్నారు.

కెసిఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం.. కేంద్రం కంటే భారీగా పెరిగిందన్నారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే… ప్రధానిగా మోడీ చేసిన అప్పు చాలా ఎక్కువ అన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పులు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆ అప్పు భవిష్యత్తు మీద పెట్టుబడి మాత్రమేనని తెలిపారు. ఆ పెట్టుబడి ద్వారా సంపాదన సృష్టించడమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు కేటీఆర్. మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్ళు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version