తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించిన మన ఎమ్మెల్యే ఒకరు మంత్రి హరీష్ రావుపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మేము అందరం హరీశ్‌రావు వెంట ఉంటాం.. ఆయనకు అండగా ఉంటామని స్పష్టం చేశారు కేటీఆర్. పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు ఉన్నారు. హరీశ్‌రావు బీఆర్ఎస్ లో మూలస్తంభంగా కొనసాగుతారని పేర్కొన్నారు కేటీఆర్.
మెదక్ అభివృద్ధికి అడ్డుపడింది మంత్రి హరీష్ రావే అని సంచలన ఆరోపణలు చేశారు మైనంపల్లి హన్మంతరావు. అవసరమైతే హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సిద్దిపేటలోనూ తన తడాఖా చూపిస్తానని హెచ్చరించారు.మెదక్ లో ప్రచారం చేయడానికి హరీష్ రావు ఎవరు..? అని ప్రశ్నించారు. హరీష్ రావును గద్దెదించే వరకు నిద్రపోనని అన్నారు. మెదక్ లో హరీష్ రావు వేలు పెడితే తాను సిద్దిపేటలో పెడతారని హెచ్చరించారు. దీంతో కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.