తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గంపా గోవర్దన్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ గవర్నర్ ప్రస్తుతం హైదరాబాద్ లో లేదు. అయితే పాండిచ్చేరికి వెళ్లింది. పాండిచ్చేరి నుంచి గవర్నర్ తమిళి సై ఇవాళ రాత్రికి హైదరాబాద్ రానుంది. రాజ్ భవన్ కి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా సీఎం పోటీ చేసే కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గంపా గోవర్దన్, అదేవిధంగా పట్నం మహేంధర్ రెడ్డిని పార్టీ టికెట్ కేటాయించడంతో అతనికి కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పించే అవకాశముంది. వీరిద్దరిలో ఎవ్వరికీ ఉద్వాసన పలుకుతారో తెలియాల్సి ఉంది. మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పట్టు బట్టడంతో మహేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చేట్టు కనిపిస్తోంది. ఎవరికీ ఇస్తారనేది మాత్రం త్వరలోనే తేలనుంది. మరోవైపు ఇవాళ 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ వెళ్లినప్పుడే మంత్రి వర్గం విస్తరణ చేస్తారనుకున్నారు. కానీ ఇప్పటి వరకు చేయలేదు.