కవిత కు ఈడీ నోటీసుల పై స్పందించిన మంత్రి మల్లారెడ్డి

-

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై మంత్రి చామకూర మల్లారెడ్డి తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సుప్రింకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే మళ్లీ నోటీసులు ఇచ్చారని.. కావాలనే వారు నోటీసులు పంపారు. వాళ్ల జిమ్మిక్కులు,మానసికంగా,రాజకీయంగా తొక్కాలని చూస్తున్నారు.నా మీద కూడా ఐటీ దాడులు కాలేదా..ఏమైంది అన్నారు. అదో పార్ట్ మాత్రమే..వాళ్ల చేతిలో ఉంది ఐటీ,ఈడీలే అని పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ దేశ ప్రధాని అయితే దేశం నెంబర్ వన్ అయితది అన్నారు.

దేశంలోనే తెలంగాణ ఓ మోడల్ అని.. అభివృద్దిలో తెలంగాణ బెంగళూర్ ను బీట్ చేసింది అని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు కలలో కూడా ఊహించని గిఫ్టు సీఎం కేసిఆర్ ఇచ్చారని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి. 2024 కేంద్రంలో సీఎం కేసిఆర్ పాగా వేస్తారని జోస్యం చెప్పారు. దేశానికి సీఎం కేసిఆర్ అభివృద్ది మోడల్ అవసరం అని తెలిపారు. అన్ని వనరులున్నా కాంగ్రెస్,బీజేపీ ఏం చేయలేదన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ ఏవిధంగా అభి వృద్ధి చేశారో ప్రధాని అయితే దేశాన్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తారని మంత్రి చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news