సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్. తెలంగాణ వైద్య రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్ లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని సూచించారు తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి. స్కిల్ క్యాపిటల్ గా హైదరాబాద్ మారబోతోందని పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులుగా తీర్చిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు సీఎం.కాంగ్రెస్ చొరవతోనే హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలు వచ్చాయని గుర్తుచేశారు రేవంత్ రెడ్డి.

ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదిక అయింది. ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. పారిశ్రామికవేతలకు ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తామని.. దేశంలో ఎక్కడ లేని విధంగా కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version