వరద ముంపు ప్రాంతాల్లో బైక్ పై తిరుగుతూ కింద పడిపోయారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో.. మంత్రి పొంగులేటికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా మున్నేరు పరివాహక ప్రాంతంలోని నీట మునిగిన నాయుడుపేట, జలగంనగర్, దానవాయిగూడెంలోని కాలనీలను పరిశీలించారు మంత్రి పొంగులేటి.

ఈ సందర్భంగా బైక్‌పై తిరుగుతూ.. ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు మంత్రి శ్రీనివాసరెడ్డి.
వరద ముంపు ప్రాంతాల్లో బైక్ పై తిరుగుతూ కింద పడిన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పల్ప గాయాలు కూడా అయ్యాయి. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.