HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటే లిమిట్ లెస్ పవర్. ఆయన కనబడితే చాలు అభిమానులు లో పూనకాలు వస్తాయి. ఎంత ఎదిగినా కూడా ఆయన తత్వం ఏమాత్రం మారలేదు. పైగా సాటి మనిషికి సహాయం చేసే గుణం ఒక సాధారణ జీవితంతో స్పెషల్ గా నిలబడ్డారు. సామాన్యులే కాకుండా ప్రముఖులు కూడా ఆయనకు ఫ్యాన్స్ ఏ. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన అభిమానులకి ఇది ఒక పండగ అని చెప్పొచ్చు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలలో నటించి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు.
కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 1968 సెప్టెంబర్ 2న మూడవ కొడుకుగా పుట్టారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఆయన చేరుకున్నారు. చిన్నతనంలో ఆస్తమా కారణంగా ఆయన బాధపడ్డారు. తరచు అనారోగ్య సమస్యకి గురయ్యారు. చదువులో చురుకుగా లేకపోవడంతో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో ఆయన ఆ ప్రాణాన్ని తీసుకోవాలనుకున్నారు. అన్నయ్య చిరంజీవి మార్గదర్శకత్వంలో సత్యానంద్ దగ్గర నటన శిక్షణ తీసుకున్నారు తర్వాత అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. అప్పటినుంచి ఇప్పటివరకు అందర్నీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు పైగా రోజురోజుకీ ఆయన ఎదుగుతూ ఉన్నారు.
పవన్ కళ్యాణ్ కి అన్ని రంగాల్లో కూడా పట్టు ఉంది. ప్యారా గ్లైడింగ్, కర్ణాటక సంగీతం ఇవన్నీ కూడా ఆయనకు వచ్చు. డిప్లమో ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి కొంత పట్టు కూడా సాధించారు. సినిమాలు షూటింగ్స్ ఏ కాకుండా రాష్ట్ర జాతి అంతర్జాతీయ రాజకీయాల పరిస్థితులపై ఆయనకు అవగాహన ఉంది. జనసేనను రాజకీయాలకు ప్రయోగశాలగా మార్చారు. అణగారిన వర్గాల నుంచి ప్రతిభావంతుల్ని సమర్ధుల్ని నాయకులకు తీర్చిదిద్దారు. 2024 ఏపీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో కీలక పాత్ర పోషించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ఆస్తులు 165 కోట్లు. 118 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. 14 కోట్ల విలువైన కార్లు, బైకులు కూడా ఉన్నాయి.