7వ తరగతి విద్యార్థికి ఇందిరమ్మ ఇల్లు కనుకగా ఇచ్చిన పొంగులేటి..!

-

మహబూబాబాద్ జిల్లా మరిపెడ లో ఓ నిరుపేద విద్యార్థికి గిప్ట్ గా పెన్ను ఇచ్చి.. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు కనుకగా ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరిపెడ లోని సోషల్ వెల్ఫెర్ లో ఈ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి.. మంత్రి విద్యార్థులతో మాట్లాడుతుండగా సార్ నీను మీ వీరా అభిమానిని అంటూ ముందుకొచ్చాడు. అతన్ని అక్కున చేర్చుకున్నారు మంత్రి పొంగులేటి.

అయితే భావోగ్వదానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థికి.. గిప్ట్ గా ఓ పెన్ను అందించి కుటుంబ సమస్యలు తెలుసుకున్నారు మంత్రి. ఆ తర్వాత తమకు.. కనీస ఇల్లు లేదని విద్యార్థి మా అమ్మ నాన్న పూరిగుడెసె లో ఉంటూ నన్ను చదివిస్తున్నారు అనీ చెప్పడంతో.. వెంటనే జిల్లా కలెక్టర్ ను పిలిచి వారి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు మంత్రి పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news