కేసీఆర్ దిగిపోయే నాటికి 18300 కోట్లు సీతారామా వ్యయం చేశామన్నారు. కానీ వాస్తవానికి 7300 కోట్లు ఖర్చు చేశారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మోటార్లు బిగిస్తే ఎక్కువ కమీషన్ వస్తది కాబట్టి మోటార్లు బిగించారు. 430 కోట్లు కరెంట్ బిల్లు కట్టి నాలుగేళ్లు గా డ్రై రన్ చేయలేదు. ఎందులో ఎక్కువ కమిషన్ వస్తాదో దానిపైనే దృష్టి సారించారు అని తెలిపారు.
సీతారామ ప్రాజెక్టులో జీరో నుంచి చివరి వరకు తిరిగి మాట్లాడుతున్న. ఖమ్మం జిల్లాలో అప్పుడు, ఇప్పుడు మిమ్మల్ని ఆదరించింది ఒక్కటే సీటు. అది నా శిష్యుడు నా బొమ్మ పెట్టుకుని గెలిచాడు. ఖమ్మం జిల్లా ప్రజలు మీ మాట, మీ మామా మాట వినరు. ఖమ్మం జిల్లాలో భవిష్యత్ లో ఎప్పుడూ మీరు ముక్కు నేలకు రాసిన నమ్మరు అని స్పషం చేసారు. అలాగే ఖమ్మం జిల్లా గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. మిషన్ కాకతీయ పేరుతో నిజాం నాటి ట్యాంక్ లో మట్టి తీసి అన్నీ మేమే కట్టామని బిల్డప్ ఇచ్చారు అని మంత్రి పొంగులేటి అన్నారు.