ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పేదలందరికీ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన, ఇళ్ల నిర్మాణం కోసం మూడు లేదా నాలుగు నమూనాలతో ప్లాన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం చర్యలు చేపట్టాలన్నారు.
రాజీవ్ స్వగృహ ద్వారా అభివృద్ధి చేయబడిన ఆస్తుల గురించి మంత్రి ఆరా తీశారు. విక్రయించబడని ఆస్తులను తగిన ధరలతో మార్కెట్ చేయడానికి మరియు విక్రయించడానికి వృత్తిపరమైన (expert) బృందాలను నియమించాలని ఆదేశించారు. సెమీఫినిష్డ్ టౌన్‌షిప్‌లను సరి అయిన ధరలకు కేబినెట్‌లో చర్చించి విక్రయించేందుకు తగిన నిర్ణయం తీసుకోనున్నారు. అమ్మకం ద్వారా వచ్చిన మొత్తం పేదల INDIRAMMA హౌసింగ్ కోసం ఉపయోగించబడుతుందని పొంగులేటి పేర్కొన్నారు. టెండర్లు ఖరారు చేసి నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయుటకు అవసరం అయిన నిధుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు.