తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం మాజీ సీఎం కేసీఆర్ ని తెలంగాణ ప్రభుత్వం తరపున నేను, ప్రోటోకాల్ అధికారులు వచ్చాము అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలో అందరిని గౌరవించాలి అనేది మా పార్టీ తీసుకునం నిర్ణయం. లంచ్ టైం లో వచ్చాము కాబట్టి కేసీఆర్ లంచ్ చేయమంటే చేశాం అని తెలిపిన మంత్రి పొన్నం.. మా భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదు అని క్లారిటీ ఇచ్చారు.
అయితే మేము ప్రభుత్వం తరపున అందరిని ఆహ్వానిస్తున్నాం.. కానీ కేసీఆర్ వస్తారా..? రారా..? అన్న నిర్ణయం పార్టీలో చర్చించి ఆయన తీసుకుంటారు అని మంత్రి పేర్కొన్నారు. ఆ తర్వాత రావాలా వద్దా అనేది ఆయన ఇష్టం. అయితే తెలంగాణలో పార్టీల మధ్య రాజకీయాలు ఉండొచ్చు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని పార్టీలతో కలిసి వెళ్లాలనేది మా నిర్ణయం అని మంత్రి పొన్నం స్పష్టం చేసారు.