కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ ఒకటో తారీఖు జీతాలు ఇస్తూ, రుణమాఫీ చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది అని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సుంకీ శాల పై కూడా విచారణకు ఆదేశిస్తున్నం..సమగ్రమైన రిపోర్ట్ తెప్పించ్చుకొని ఆనాడు BRS హయంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక పరమైన నివేదికలతో మీ ముందుకు వస్తాం.
ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. బ్రష్ పార్టీ డిఫెన్స్ లో పడి అసెంబ్లీ లో సోషల్ మీడియా లో గిరిజన మహిళా అని చూడకుండా సోషల్ మీడియా లో పోస్ట్ లు చేశారు. అసందర్భమైన ఆరోపణలతో శాసన సభ లో సరైన విధంగా జవాబులు చెప్పలేక. స్పీకర్ గారు దళితుడు అని దొర తనంతో అధ్యక్ష అని పిలువలేక శాసన సభకు రాలేకపోయారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని పొన్నం పేర్కొన్నారు.