ఒలింపిక్స్ నుండి భారత అభిమానులకు షాక్ ల మీద షాక్ లు తగుతూలుతూనే ఉన్నాయి. నిన్న వినేశ్ పొగట్ పై వేటు నుండి ఇండియాకు అన్ని బ్యాడ్ న్యూస్ లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఒలింపిక్స్ నుండి ఈ రోజు మరో బ్యాఫ్ న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. భారత యువ రెజ్లర్ అంతిమ్ ఒలింపిక్ కమిటీ వెన్నకి పంపించేసింది.
క్రీడాకారులు మాత్రమే ఉండాల్సిన ఒలింపిక్ విలేజ్ లోకి అంతిమ్ తన సోదరిని దొంగచాటుగా తీసుకెళ్లింది. అయితే ఆమెను పోలీసులు పట్టుకొని విచారించి వదిలేసారు. అలాగే అంతిమ్ ను వెన్నకి పంపించేశారు. ఇక ఈ కారణంగా తాజాగా రెజ్లర్ అంతిమ్ పై మూడేళ్ల నిషేధం విధించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఈ ఈ నిషేధం విధించినట్లు ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. దీంతో మూడేళ్లు అంతిమ్ నేషనల్ లెవల్ అలాగే ఇనటర్నేషల్ లెవల్ కు మూడేళ్లు దూరంగా ఉండాల్సిందే.