తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మార్చిలోపు లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించామని వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 17 వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.

ఇక అటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు పొంగులేటి. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని నిర్ణయించాం… గత మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన అంశాల అమలుపై సమీక్ష మని ప్రకటించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.