ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉపాధి కూలీలకు అలర్ట్. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం కింద 170 కోట్లు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించేందుకు తాజాగా మోడీ ప్రభుత్వ మాంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేమెంట్లు ఇవ్వలేదని.. తాజాగా కేంద్రానికి సమాచారం ఇచ్చింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఐదు సంవత్సరాలపాటు సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నిధులు ఆగిపోయినట్లు కూడా ఫైల్స్ ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాము పదేపదే విజ్ఞప్తులు చేయడంతో 180 కోట్ల విలువైన 3.5 లక్షల ఉపాధి హామీ పనులకు కేంద్ర ప్రభుత్వం.. రీస్టార్ట్ చేస్తూ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించిందని తాజాగా ప్రకటన విడుదలైంది.