డబుల్ బెడ్‌రూం ఇళ్లు రానివారికి స్థలం : మంత్రి సబిత

-

Minister Sabita : తెలంగాణ రాష్ట్ర నిరు పేదలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆన్లైన్ డ్రా పద్ధతిలో పారదర్శకంగా కేటాయిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాని పేదలకు ఉచితంగా 75 గజాల స్థలం, గృహలక్ష్మి పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు ఇస్తామని వెల్లడించారు.

తుక్కుగూడలో ఒకే వర్గానికి లబ్ధి జరుగుతుందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కుల, మతాలకతీతంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఇది ఇలా ఉండగా… ఉమ్మడి పాలమూరు ప్రజల చిరకాల కోరిక ఇవాళ నెరవేరబోతోంది. పాలమూరు ప్రజల కాళ్లు ఇవాళ కృష్ణమ్మ నీటితో తడవబోతున్నాయి. ఆ జిల్లా ప్రజల గొంతును కృష్ణమ్మ నేడు తడపబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుతఘట్టం ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాళ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version