మ‌ల‌క్ పేట ప్ర‌భుత్వ హ‌స్ట‌ల్ ఘ‌ట‌న‌పై మంత్రి సీత‌క్క స‌మీక్ష‌..!

-

మ‌ల‌క్ పేట లోని ప్ర‌భుత్వ అంద‌బాలిక‌ల హ‌స్ట‌ల్లో బాలిక‌పై లైంగిక దాడి జ‌ర‌గ‌లేదని తాను అసెంబ్లీలో చెప్పిన‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని మంత్రి సీత‌క్క ఖండించారు. ఆ రోజు త‌న‌కు అధికారులిచ్చిన స‌మాచారాన్నిమాత్ర‌మే తాను ప్ర‌స్తావించిన‌ట్లు తెలిపారు. తాను చేసిన మాట‌ల‌ను వ‌క్రీక‌రించ వ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. ఇటువంటి సున్నిత‌మైన అంశాల ప‌ట్ల బాద్య‌త‌తో వ్య‌హ‌రించాల‌ని కోరారు. ఈ కేసు విష‌యంలో ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌కంగా వ్య‌హ‌రిస్తోంది. ఎవ‌రికి ఏలాంటి అనుమానాలు ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. ఏవ‌రు కోరినా కేసు పూర్వ ప‌రాలు, పురోగ‌తిని తెలియ చేసేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు.

అంద‌బాలిక లైంగిక దాడి కేసు పురుగతిని మంత్రి సీత‌క్క స‌చివాలయంలో స‌మీక్షించారు. కేసు పురోగ‌తిని అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డింద‌ని..బాదిత కుటుంబానికి అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు ఇస్త‌న్న‌ట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. నిందితుడిని ఇప్ప‌టికే అరెస్టు చేసిన‌ట్లు, ద‌ర్యాప్తును వేగ‌వంతం చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version