మహిళా భద్రత కోసం ఐదు రోజుల పాటు త్వరలో స్పేషల్ డ్రైవ్ చేపట్టబోతున్నాం అని మంత్రి సీతక్క తెలిపారు. స్వల్పకాలిక ప్రణాళికలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చేస్తాం సొంత నివాసాల్లో, దగ్గరి మనుషుల నుంచి మహిళలకు వేదింపులు పెరగడం భాదాకరం. వేధింపులు ఎదుర్కున్న మహిళలకు ఓపెన్ గా మాట్లాడే ధైర్యం కల్పిస్తాం. తద్వారా వేధింపులకు పాల్పడాలంటేనే బయపడుతారు అని సీతక్క అన్నారు.
సమాజంలో ఆలోచన మారే విధంగా ప్రాణాళిక రూపొందిస్తాం. ప్రజల్లో మార్పు తెచ్చేలా ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తాం. విద్యా సంస్థలు, ఇతర సంస్థల్లో అవేర్ నెస్ క్యాంపేయిన్ లు చేపడుతాం. మహిళా మంత్రులు, ఉన్నతాధి కారులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం. మహిళా సంఘాల్లో 63 లక్షల మంది సభ్యులున్నారు. మహిళా సంఘ సభ్యులతో గ్రామ స్థాయి నుంచి సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. బాధిత మహిళలకు ఈ యాక్షన్ కమిటీలు రక్షణ కవచంగా నిలుస్తాయి. అలాగే మహిళలను వేధించకుండ పురుషులకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని సీతక్క పేర్కొన్నారు.