బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది. బీజేపీకి బీ టీం గా బీఆర్ఎస్ పనిచేస్తోంది. కేసులు నుంచి తప్పించుకునేందుకు బిజెపితో బీఆర్ఎస్ అంటకాగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుంది. పదే పదే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది.
అందులో భాగంగా మహిళల ఉచిత ప్రయాణ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో చేతిలో చిల్లి గవ్వ లేకున్నా మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లను ఉసి గొల్పి ధర్నాలు చేయిస్తున్నారు. ఓలా ఉబర్ క్యాబ్లు, బైక్లు తెచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకు రాలేదా.. కోట్లాదిమంది మహిళలకు అన్యాయం చేసేలా బీఆర్ఎస్ కుట్రలుల పన్నుతోంది. పంట రుణమాఫీని చేయని బీఆర్ఎస్ ఇప్పుడు రైతుల ప్రేమ కురిపించడం విడ్డూరంగా ఉంది. బీఆర్ఎస్ హాయంలో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. బీఆర్ఎస్ చేసిన రుణ మాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు అని సీతక్క అన్నారు.