“రేవంత్ సర్కార్” ఇసుక మాఫియాలో చిక్కుకుంది. అయితే.. ఈ ఇసుక మాఫియాలో ఇద్దరు తెలంగాణ మంత్రుల పీఏలు సస్పెండ్ అయ్యారని సమాచారం అందుతోంది. ఇటీవలే ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలతోనే ఇసుక దందా చేస్తూ బరితెగించింది ఇసుక మాఫియా. అంతేకాదు…పట్టుబడ్డ లారీలు వదిలిపెట్టాలంటూ పోలీసులకు ఫోన్ చేసి మంత్రి సీతక్క పీఏ బెదిరింపులకు దిగారని మొన్న వార్తలు బయటకు వచ్చాయి.

భద్రాచలం వద్ద 16 లారీల పట్టుబడగా టీఎస్ఎండీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ లారీలు కాంగ్రెస్ నేతలవి అంటూ బెదిరింపులకు దిగారట. ఇక అటు రేవంత్ రెడ్డి ఫోటోలు కనపడకుండా అద్దాలు పగలగొట్టుకున్నారు లారీ డ్రైవర్లు. అయితే…ఈ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల భద్రాచలంలో పట్టుబడిన 16 ఇసుక లారీల వ్యవహారంలో మంత్రి సీతక్క పీఏ సుజిత్ రెడ్డి సహా మరో మంత్రి పీఏను సస్పెండ్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన మరో మంత్రి పీఏ కూడా సస్పెండ్ అయ్యారట.