ఇది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేశారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. దీంతో శ్వేతపత్రంపై అసెంబ్లీలో వాడివేడి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి హరీష్ రావు మళ్లీ తన స్టైల్ లో రెచ్చిపోయారు.
కాంగ్రెస్ మంత్రులను ఓ ఆట ఆడుకున్నారు. మేము మాట్లాడుతుంటే ఇంకో సభ్యులకు అనుమతి ఇవ్వకండని…సత్య దూరమైన విషయాలు శ్వేతపత్రంలో పొందుపరిచారని మండిపడ్డారు. నిజాం అప్పటి నుంచి నిధులు ఖర్చు పెట్టారా..? రాయలసీమ లిఫ్ట్ గురించి అబద్ధాలు రాశారని ఆగ్రహించారు. ఎన్నికల్లో గోబెల్స్ ప్రచారం చేశారు..ఇప్పుడు సభలో కూడా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రాజెక్టులు అప్పగిస్తాం అని మినిట్స్ లో ఉన్నదన్నారు. ఫిబ్రవరి 1 తేదీ జరిగిన మీటింగ్ లో కూడా ఒప్పుకున్నారని పేర్కొన్నారు హరీష్ రావు.