లగచర్ల లో కలక్టర్.. అధికారులపై దాడి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది అని పేర్కొన మంత్రి శ్రీధర్ బాబు.. ప్లాన్ ప్రకారమే… దాడి జరిగింది అని అన్నారు. రైతుల దగ్గరకే వెళ్దాం. అభిప్రాయాలు తెలుసుకుందాం అని వెళ్ళారు. కానీ కొందరు అక్కడి ప్రజలను రెచ్చగొట్టి… కలక్టర్ పై దాడి చేయించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకి ఆదేశం ఇచ్చాము.
అయితే ఈ ఘటనలో కుట్ర దారులు ఎవరు.. కలక్టర్ నీ తీసుకెళ్ళింది ఎవరు లాంటి అంశాలపై సమగ్ర విచారణ ఉంటది. ప్రభుత్వ పథకాలు అడ్డుకునే వారిపట్ల కఠినంగా ఉంటాం. అధికారులపై దాడి జరిగితే ఉపేక్షించం. BRS నేతలు అధికారం రాలేదనే ఆక్రోశంతో ఉన్నారు. ప్రభుత్వ పథకాలు అడ్డుకోవాలని చూస్తున్నారు. మేము వేసే ప్రతీ అడుగులో.. అడ్డంకులు.. న్యాయ పరమైన చిక్కులు తెచ్చే పనిలో ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు దిగలేదు. BRS వినకుండా ఉంటే.. మేము న్యాయపరంగా వెళ్లే వాళ్ళం. పరిశ్రమలు ప్రగతికి ముఖ్యం. మీరు పరిశ్రమలు పెట్టినప్పుడు మేము ఇలాగే చేస్తే… అభివృద్ధి జరిగేదా అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.