డ్రగ్ కంట్రోల్ అధికారులకు మంత్రి రాజనర్సింహ కీలక ఆదేశాలు..!

-

డ్రగ్ కంట్రోల్ అథారిటీ, TGMSIDC అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఇందులో నాసిరకం నకిలీ మందులు తయారీ చేసేవారిపై, అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు మంత్రి. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలి. ఫార్మా సంస్థలు ఉన్నచోట అదనంగా డ్రాగ్ ఇన్స్పెక్టర్లను నియమించాలి. పెరిగిన మెడికల్ షాప్స్ కి అనుగుణంగా డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ పెంచాలి.

అయితే ప్రస్తుతం 71 మంది డ్రాగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు.. ఇంకా కనీసం 150 మంది అవసరమని మంత్రికి డిసిఏ అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చించి అవసరమైన మేరకు పోస్టులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి.. మత్తుని కలిగించే మందులను విచ్చలవిడిగా అమ్ముతున్న వారిపై నిగాపెట్టాలి. ప్రభుత్వ దవాఖానాలలో పంపిణీ చేసే మెడిసిన్ కొనుగోలు విషయంలో TGMSIDC కి DCA సహకారం అందించాలి. ప్రభుత్వాసుపత్రిలోకి వచ్చి పేషెంట్లకు నాణ్యమైన మెడిసిన్ అందించేలా చర్యలు ఉండాలి అని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version