మంథని పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. అందులో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రైతులకు 2 లక్షల రుణమాఫీ మూడు దఫాలుగా చేశాం. సాంకేతిక కారణాలతో రాని వారికి కూడా తప్పకుండా రుణమాఫీ చేస్తాం అని భరోసా ఇచ్చారు. అలాగే మహిళలకు వడ్డీ లేని రుణాలు మొదట ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేసారు.
మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంకల్పంతో పనిచేస్తుంది. అయితే మహిళలను హైదరాబాదు కు తీసుకెళ్లి ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలి అని ఆదేశాలు జారీ చేసారు. ఇంకా మంథని, కాటారం లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ఏర్పాటు చెయ్యాలి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంథని మున్సిపల్ కార్యాలయం నిర్మాణం చేపట్టాలి. అదే విధంగా మంథనిలో పలురకాల పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించి అభివృద్ది చేస్తాం అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.