హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థులు తాయారు చేసిన డ్రైవర్ లెస్ వెహికిల్ లో ప్రయాణించారు మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఐఐటీ డైరెక్టర్ మూర్తి. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఐఐటీ విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ లెస్ కారు అద్భుతంగా ఉంది. సిలికాన్ వ్యాలీలో నేను, సీఎం రేవంత్ రెడ్డి డ్రైవర్ లెస్ వెహికిల్ లో ప్రయాణం చేశాము. అక్కడికంటే అద్భుతమైన అనుభూతి ఇప్పుడు ఇక్కడ ప్రయాణం చేస్తుంటే కలిగింది అని మంత్రి అన్నారు.
మన తెలంగాణలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన ఈ టెక్నాలజీ మొత్తం మన దేశానికే గర్వ కారణం అవుతుంది. అయితే ప్రస్తుతానికి ప్రయోగ దశలో ఉన్న ఈ టెక్నాలజీ త్వరలోనే ఆచరణలోకి రావాలని నేను మస్ఫూర్తిగా కోరుకుంటున్న. అలాగే ప్రస్తుతం ప్రపంచంలో ఊపు మీద ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సేవలను కూడా త్వరలోనే అన్ని రంగాల్లో ఉపయోగించుకుంటాం అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.