హై కోర్టు తీర్పు పై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని  ఇవాళ వెల్లడించిన తీర్పు ద్వారా తెలిసిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు వారి అస్తిత్వం కనుమరుగవుతుందని కుట్ర చేసి బీసీల ద్వారానే బీసీ మంత్రి నైనా నాపై కేసు వేయించారని విమర్శించారు.

ఎన్నికల్లో ప్రజల హృదయాలను గెలిచి ఓట్లు సాధించి విజయం కైవసం చేసుకోవాలి. కానీ, ఇలా అక్రమంగా కోర్టు కేసుల ద్వారా తప్పుడు మార్గంలో గెలుపు కోసం ప్రయత్నించడం దుర్మార్గం. కనీసం తాగు, సాగు నీళ్లు ఇవ్వని వారిని ప్రజలు చీదరించుకున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని సమస్యలు తీరాయి. మహబూబ్‌నగర్‌ గతంలో ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారు. ఒకప్పుడు వెనకబడిన జిల్లా ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఓర్వలేక ఆ ఇద్దరు ప్రధాన పార్టీలో ప్రతిపక్ష నేతలు కుట్రతో కేసు వేయించారని మండిపడ్డారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version