BREAKING : మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టు లో చుక్కెదురు..వేటు తప్పదా ?

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో చుక్కెదురైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. తన ఎన్నిక చెల్లందంటూ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టును కోరారు శ్రీనివాస్ గౌడ్ పిటిషన్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించారని పిటిషన్ గతంలో వేశారు.

శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే, మంత్రి గా కొనసాగే అర్హత లేదని పిటిషన్ దాఖలు చేశారు మహబూబ్ నగర్ ఓటర్ రాఘవేంద్ర రాజు. అయితే… పిటిషన్ కు అర్హత లేదని పిటిషన్ కు కొట్టివేయాలని శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ వేశారు. ఇప్పటికే ఇరువాదనలు పూర్తి కాగా… శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ కొట్టివేసింది తెలంగాణ హై కోర్టు. పిటిషనర్ వేసిన పిటిషన్ ను అనుమాతించింది హై కోర్టు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు చుక్కెదురైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version