KTR Reaction On Congress Telangana Thalli: తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం మాయం…. చేతిలో బతుకమ్మ మాయం అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రిలీజ్ చేసిన తెలంగాణ తల్లి నమూనాపై స్పందించారు కేటీఆర్. తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం మాయం….తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం….తెలంగాణ తల్లి కాళ్ల కడియాలు మాయం అంటూ ఆగ్రహించారు. తెలంగాణ రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం… తెలంగాణ రైతుల భూములు మాయమని ఫైర్అయ్యారు.
మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం అంటూ ఎద్దేవా చేశారు. టీఎస్ లో ‘ఎస్’ మాయం… ఖజానాలో కాసులు మాయం అన్నారు. మాయం చేయడం మోసం చేయడం అంటూ ఫైర్ అయ్యారు. మినహా ప్రజలకు చేసిందేమిటి ? ప్రజలకు ఒరిగిందేమిటి ? జాగో తెలంగాణ అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. ఇలాంటి సాంప్రదాయాన్ని ఎవరూ కూడా హర్షించబోరన్నారు.