ఏది లేకపోయినా అప్పు ఉంటే తీరుస్తాం..!

-

రేపు రెండు లక్షలు రైతు రుణ మాఫీ చేస్తున్నాము అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎవ్వరూ ఊహించని ఊహించని విధంగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. ప్రభుత్వంను ప్రజల ఆశీర్వదించాలి. నా జీవిత కోరిక నెరవేరింది. గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు రావాలనే కోరిక నెరవేరుతుంది. ఇంకా 70% పనులతో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

టన్నెల్ లు పూర్తి చేసి పాలేరు కు నీళ్లు ఇస్తాం. కేవలం 80 రోజుల్లో వైరా రిజర్వాయర్కు నీరు అందిస్తున్నము. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని అనుకున్నారు కానీ వారి గొంతులో ఇప్పుడు పచ్చి వెలక్కాయబడింది. 9 నెలలు కాకముందే బిడ్డ పుట్టాలని ప్రతిపక్ష నాయకులు అనుకుంటున్నారు. చేతకాని వాగ్దానాలు చేసి రైతుని మోసం చేసే ప్రభుత్వం మాది కాదు. ఇప్పటికే కారు కూతలు కూశారు. అబద్ధపు మాటలతో ఇప్పటివరకు రైతులను మోసం చేశారు. ఇంకా రైతులు మోసపోరు. 18 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రిలీజ్ చేశాం మిగిలినవి కూడా రిలీజ్ చేస్తాం. తెల్లకార్డు లేకపోయినా పాసుబుక్ లేకపోయినా వారి పేరు మీద అప్పు ఉంటే తీరుస్తాం అని తుమ్మల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version