ఖమ్మం ప్రజలకు గుడ్‌న్యూస్..ఆగస్ట్ 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కానుందని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రకటించారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న వ్యవసాయ రైతాంగ సదస్సు ఉంటుందని… ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారని తమ్మల తెలిపారు.
వైరా శాంతినగర్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలాలను పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాలోతు రాందాస్ నాయక్. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ…ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. వైరాలో ఒంటి గంటకు సభ వేదికపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతాంగ సంక్షేమ పథకాలపై రుణమాఫీ సంబరాలు జరపాలని తెలిపారు. రైతు సదస్సులో శాఖల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరావు.