సన్నవడ్ల బోనస్ పై అధికారులకు మంత్రి ఉత్తమ్ దిశానిర్దేశం..!

-

ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. బోనస్ అమలు పై అధికారులకు దిశానిర్దేశం చేసారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. సన్నాలకు, దొడ్డు వడ్లకు వేరు వేరుగా కొనుగోలు కేంద్రాలు ఆనాటి. ఖరీఫ్ లో 60 లక్షల 39 వేల ఎకరాల్లో సాగు జరిగింది. 146 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేస్తున్నాము. 91 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొట్టమొదటి సారిగా 40 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోడౌన్ ల ఏర్పాటు చేసాం.

డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదు. సరిహద్దు రాష్ట్రలనుండి వచ్చే ధాన్యంపై గట్టి నిఘా ఉంచాలి. ప్రభుత్వం ఆశించిన మేరకు సన్నాల దిగుబడి ఉంటుంది. 36 లక్షల 80 వేల ఎకరాల్లో సన్నాలు సాగు జరగా.. 88 లక్షల 9 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా ఉంది. ఖరీఫ్ నుండి సన్నాలకు 500 బోనస్ ఇస్తాం. ఈ నిర్ణయం విప్లవాత్మకమైనది. కానీ సరిహద్దు రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే చర్యలు కఠినంగా ఉంటాయి. ధాన్యం కొనుగోలులో అధికారులదే కీలక పాత్ర. ప్రభుత్వ పరంగా అన్నీ ఏర్పాటు చేస్తాం అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news