తెలంగాణలో గత వారంలో కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల వరదలు వచ్చిన విషయం తెలిసిందే. వరదళ్ల ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. అలాగే చాలా మేర రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ క్రమంలో వరద నష్టాన్ని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన నీటిపారుదల శాఖ చర్యలు చేపట్టింది. కాలువలు, చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 773 చెరువులు, కాలువలకు గండ్లు పడినట్లు తెలిపింది.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహయాన్ని కోరుతూ నివేదిక అందజేసింది ప్రభుత్వం. తాత్కాలిక మరమ్మతులకు 75 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకై 483 కొట్ల మంజూరీకి వినతి పత్రం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న కాలువలు, చెరువులు, పంప్ హౌజ్ లతో పాటు చెక్ డ్యామ్ ల మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన కసరత్తు చేస్తుంది. ఖరీఫ్ పంటను కాపాడడంతో పాటు నీటిసరఫరా పునరుద్ధరణ లక్ష్యంగా చర్యలు చెప్పటింది. ఈ క్రమంలోనే నేడు హుజుర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో స్వయంగా పర్యటించి పునరుద్ధరణ పనులను పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.