ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదు : మంత్రి ఉత్తమ్‌

-

నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగిస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఖండించారు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌, హరీశ్‌ రావు ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాల అంశానికి సంబంధించి శాసనసభలో అన్ని విషయాలపై చర్చిస్తామని తెలిపారు.

గత తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఉమ్మడి ఏపీలోనూ జరగలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులు, ప్రజలు ఈ విషయాలను గమనించాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంపై చర్చించేందుకు రావాలంటూ 2020 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి నాటి సీఎం కేసీఆర్‌ను పిలిస్తే వెళ్లలేదని చెప్పారు. రూ.95 వేల కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం బ్యారేజీ కుంగిపోతే కేసీఆర్‌ ఒక్క మాట మాట్లాడలేదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news