తెలంగాణ రేషన్ డీలర్లకు కేసీఆర్ సర్కార్ తీపికబురు చెప్పింది. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఇవాళ రేషన్ డీలర్లతో తెలంగాణ మంత్రుల చర్చలు సఫలం అయ్యాయి. ఈ సమావేశంలో . రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ ను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ ను 70 నుంచి 140 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే, రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా సమయంలో చనిపోయిన డీలర్ల స్థానంలో కుటుంబ సభ్యులకు డీలర్ షిప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.