తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ని ఇవాళ మధ్యాహ్నం 1.20 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత 1.04 గంటలకు అనుకున్నప్పటికీ ట్రాఫిక్ వల్ల సమయం కాస్త ఆలస్యం అయింది. ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రవీంద్ర భారతి వద్ద ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఆ తరువాత ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేయడంతో సిద్ధరామయ్య ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క మల్లు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నంప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, జూపల్లి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖలు ప్రమాణం చేశారు.