తెలంగాణ నూతన సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం

-

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. రేవంత్ రెడ్డి అను నేను అంటూ ఆయన ప్రమాణం చేస్తుండగా ఉద్వేగానికి గురయ్యారు. అంతఃకరణ శుద్ధితో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతానంటూ అతిరథమహారథులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీలు, రాష్ట్రంలోని పలు పార్టీల కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ ఉద్వేగభరిత సంఘటనకు వేదికైన ఎల్బీ స్టేడియం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడుతోంది. లక్షలాది మంది జనం రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version