హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే.. తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. మే నెలలో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ లో ఆతిథ్యం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 140 దేశాలు పాలుపంచుకునే ఈ వేడుకలను తెలంగాణ కు ప్రపంచంలో పేరు తెచ్చేలా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
ఇక అటు ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.