కూకట్ పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో మహిళలు రచ్చ చేశారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనదారున్ని కారుతో ముగ్గురు మహిళలు గుద్దేశారు. అనంతరం యువతులు హల్చల్ చేశారు. కేపీహెచ్‌పీ మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారురున్ని కారుతో ఢీకొట్టారు. ఇక ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని బెదిరించారు యువతులు. దీంతో ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు ద్విచక్ర వాహనదారుడు.
ఈ తరుణంలోనే… రంగంలో దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్టు తెలిపారు పోలీసులు. యువతులు మద్యం సేవించినట్టు తెలిపారు పోలీసులు. అటు కారులో బీర్ టిన్నులు దొరికాయి. ఇక ఈ సంఘనట పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.
మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన యువతులు
ద్విచక్ర వాహనదారులను ఢీ కొట్టిన కారు
హైదరాబాద్ – KPHB మెట్రో స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు
ఢీ కొట్టడమే కాక బైక్ వాహనదారుడిని బెదిరించిన యువతులు
ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించిన ద్విచక్ర వాహనదారుడు
రంగంలో… pic.twitter.com/tVUegVvc3W
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2025