తెలంగాణలో మూడేళ్లలో 42,561 మంది ఆడవాళ్లు మిస్సింగ్

-

తెలంగాణలో 2019-2021 మధ్య మూడేళ్ల కాలంలో మొత్తం 42,561 మంది బాలికలు, మహిళలు అదృశ్యమైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఎన్‌సీపీ సభ్యురాలు ఫౌజియాఖాన్‌ అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర తెలిపారు. ఈ మేరకు బదులిచ్చారు. ఇందులో 18 ఏళ్లలోపు బాలికలు 8,066 మంది, 18 ఏళ్లు పైబడిన మహిళలు 34,495 మంది ఉన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూడేళ్లలో 30,196 మంది బాలికలు (7,918), మహిళలు (22,278)  అదృశ్యమైనట్లు వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా ఈ మూడేళ్ల కాలంలో 13,13,078 మంది అదృశ్యం అయ్యారని కేంద్ర మంత్రి తెలిపారు. వారిలో 2,51,430 మంది బాలికలు, 10,61,648 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. వీరిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 1,98,414 మంది (బాలికలు 38,234; మహిళలు 1,60,180) ఉన్నట్లు వివరించారు. దక్షిణాదిలో అత్యధికంగా తమిళనాడులో 57,923 మంది అదృశ్యమైనట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version