చాలా మంది కేంద్రం అందించే స్కీముల యొక్క లాభాలని పొందుతున్నారు. కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని తెచ్చింది. ఈ స్కీమ్ తో అయితే నెలకు రూ.1000 పెట్టి ఏకంగా కోటీశ్వరులు అవ్వచ్చు. ఇక పూర్తి వివరాలని చూసేద్దాం… కేంద్రం ప్రభుత్వం నేషనల్ పెన్షన సిస్టమ్ అనే స్కీమ్ ని తెచ్చింది. ఎన్నో లాభాలు ఉంటాయి. ఎన్‌పీఎస్ అనేది పాపులర్ రిటైర్మెంట్ స్కీమ్‌లలో ఒకటి. ఇందులో చేరితే ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు.
60 ఏళ్లు లేదా 70 ఏళ్లు వచ్చిన తరవాత ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. అలానే మెచ్యూరిటీ సమయంలో ఒకే సారి చేతికి భారీ మొత్తం వస్తుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల మూడు రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ప్రతి నెలా డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేక పోతే ఏడాదికి ఒకే సారి డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. 70 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించొచ్చు.
60 ఏళ్లు వచ్చిన తర్వాత మీరు 60 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతం మొత్తంతో యాన్యుటీ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ స్కీము తో మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆధారంగా మీకు వచ్చే బెనిఫిట్స్ మారతాయి. రూ. 50వేల వరకు అదనపు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. మొత్తం ఈ స్కీమ్ తో రూ. 2 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ కలుగుతుంది.
ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఉన్న వారు రూ. 1,000 ఇన్వెస్ట్ చేస్తే… వార్షిక రాబడి 10 శాతం ప్రకారం చూస్తే ఎన్‌పీఎస్ అకౌంట్‌లో 70 ఏళ్లు వచ్చే సరికి రూ. కోటికి పైగా ఉంటాయి. ప్రతి నెలా దాదాపు రూ.21 వేల పెన్షన్ వస్తుంది. రూ.64 లక్షలు ఒకసారి మీ చేతికి వచ్చేస్తాయి.